ఎంతోమందికి రుద్రం/నమకం నేర్చుకోవాలని ఉంటుంది.
నమకం సుస్వరంగా నేర్చుకోవాలి, శ్రీరుద్రప్రశ్నలోని మన్త్రాలను సుస్వరంగా పఠిస్తూ నిత్యం లేదా అప్పుడప్పుడైనా రుద్రాభిషేకం చేయాలనేది చాలామందికి ఉండే చిరకాల వాంఛ. అందుకు తగిన సరైన అవకాశం, గురువులు, ఒక మంచి వేదిక కావాలి. ఇవి ఉన్నట్లైతే మన కోరిక సఫలంమౌతుంది.
సరైనమార్గదర్శనం దొరకాలి.
కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ సాధించినవాళ్ళకన్నా ప్రారంభించి మధ్యలో వదిలేసినవారే ఎక్కువ. ఎందుకంటే ఈ సాధనలో ఎదురయ్యే కొన్ని ప్రాయోగికమైన (ప్రాక్టికల్) సవాళ్ళను ఎదుర్కోవడం తెలీదు. వాటిని అధిగమించి నేర్చుకునేటట్లుగా మార్గదర్శనం చేసేవారు అత్యంత ఆవశ్యకం.
స్వరసాధన.
ఇందులో ఎదురయ్యే మొట్టమొదటి సవాలు స్వరోచ్చారణ, ఇది కంఠంమూలంగా ఉంటుంది. కొంత వయస్సు మళ్ళాక స్వరసాధన అస్సలు సాధ్యపడదు. మొదటచెప్పుకున్న సమస్యలకన్నా ఈ సవాలును అధిగమించడం మరింత కష్టంగా ఉంటుంది. ఇందుకు ఏదైనా సులభమైన మార్గం, సరసమైన శైలి ఉంటే, అది మనకి ఎవరైనా చూపిస్తే బాగుంటుంది అనే భావన కలుగుతుంది.
మన్త్రసాధనకు కొత్తపుంతలు.
ఆధునికత పెరిగినట్టే జనసామాన్యంలో కొన్ని కఠినమైన సమస్యలకు కూడా సులభతరమైన పరిష్కారాలు కావలనే కోరికా పెరుగుతూ వస్తోంది, దానికి తగ్గట్లే పరిష్కారమార్గాలుకూడా సమస్యలను వెతుక్కంటూ ఎదురొస్తున్నాయి. ఆసక్తులైనవారికి అవకాశాన్ని అందివ్వాలనే ప్రయత్నంతోపాటే సులభతరం చేసి బోధించాలనేది ఇంకొక ముందడుగు ప్రయత్నం. ఇందులో కొన్ని ఆధునికతతో ముడిపడినవి మరియు కష్టమైనవాటిని సులభతరంచేసే పరిష్కారాలు ఉన్నాయి.
సరళమైన శిక్షణవిధానం.
ఈ పాఠ్యక్రమంలో సభ్యులైన ప్రతి ఒక్కరికీ ఈ పాఠ్యక్రమం అభ్యాసస్నేహిగా ఉండాలనే అభిలాషతో మరింత సరళతరంగా, గందరగోళానికి గురికాకుండా, అధ్యయనం చక్కని అనుభూతిని పంచేలా ఈ పాఠ్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది.
వ్యక్తిగత దృష్టి.
ఒకరికి లేదా ఇద్దరికి కలిపి పాఠం చెప్పేటప్పుడు నేర్పించే అధ్యాపకుడికి వ్యక్తిగత దృష్టి ఉంటుందా అనే ప్రశ్నరాకపోవచ్చు, కానీ 5 లేదా 6గురు లేదా అంతకన్నా ఎక్కువమంది ఉన్న తరగతిలో అధ్యాపకుడు మనల్ని పట్టించుకుంటారా? మన పరిశ్రమను గుర్తించి సరైన మార్గదర్శనం చేయగలరా? మనకు తరగతి సందర్భంలో వ్యక్తిగతంగా స్పందిస్తారా? అనే ప్రశ్న రాకపోదు. కానీ మన దగ్గర ఇటువంటి ప్రశ్నకు తావులేదు. ఎందుకంటే మన తత్త్వప్రసారిణిలో అధ్యాపకులు ఎంతో అనుభవజ్ఞులు మరియు ప్రత్యేక దృష్టిసారించగలిగినవారు మరియు సాధనలో మీకు సాధ్యాసాధ్యాలయందు స్పష్టమైన మార్గదర్శనం చేయగలరు.
ఎందుకింత కఠినం?
ఎంత కష్టపడ్డా, ఎంత బుద్ధిమంతులకైనా రుద్రమంత్రాలను ఉచ్చారణ చేయడం చాలా కఠినంగా అనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే రుద్రంలోని మన్త్రాలలోగల అక్షరాలు మరియు స్వరాలు చాలా పదునుగా, తీక్ష్ణంగా ఉంటాయి. మన్త్రాలు కూడా ఛందోబద్ధంగా కాక గద్యభాగంలా ఉంటుంది. దీనిని అధ్యయనం చేసేందుకు చాలా కాకపోయినా కొంతైనా పూర్వసజ్జత కావాలి. అందుకే మందుగా అందుకు తగిన పూర్వసజ్జతతో పాటుగా నేర్పించడం జరుగుతుంది.
ఈ పాఠ్యక్రమంలో చేరడం ఎలా? దీనిగురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా? రుసుము ఎంత చెల్లించాలి? ఎలా చెల్లించాలి?
వంటి మరిన్ని వివరాలకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.